చిత్తూర్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ని వీడిన కడియం శ్రీహరికి మద్దతుగా శివప్రసాద్ మాట్లాడారు. దీంతో ఆయన పార్టీ ని వీడడానికే ఆ విధమైన మద్దతు ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. తన రాజకీయ భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని పార్టీ ని వీడినంతా మాత్రాన శ్రీహరిని ద్రోహిగానో, రాజకీయ వ్యభీచారిగానో చిత్రీకరించడం సరి కాదని శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆ మాటకొస్తే ఫిరాయింపు దార్లు కానిదేవరనేది అన్నారు. పార్టీలో కొనసాగేలా చూసుకోవడానికి బదులు పార్టీ ని వదిలిపెట్టే వారిని దూషించడం పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచిది కాదని శివప్రసాద్ అభిప్రాయంగా కనిపిస్తోంది. శివప్రసాద్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వై ఎస్ జగన్ నాయకత్వం లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గతంలో ప్రచారం సాగింది. అయితే, ఆయన పార్టీ లో కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజా ప్రకటనతో ఆయన పార్టీ లో కొనసాగే విషయం పై సందేహం కల్గుతోందని అంటున్నారు.
0 comments:
Post a Comment