- టీడీపీ అధినేత చంద్రబాబు అజెండానే సీబీఐ మోస్తోంది
- జగన్ కేసులో ఒక్కో కోర్టులో ఒక్కో వాదన వినిపిస్తోంది
- చివరికి ఒకే తుది చార్జిషీట్ వేస్తామని చెప్తున్న సీబీఐ.. అనుబంధ చార్జిషీట్లపై విచారణ కోరటం ఆశ్చర్యకరం
- బిజినెస్ రూల్స్ ప్రకారమే జీవోలు జారీ చేశామని మంత్రి కన్నా సుప్రీంకోర్టులో పేర్కొన్నారు
- బయట మాత్రం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అజెండానే సీబీఐ మోస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పే వాటినే సీబీఐ న్యాయవాది వల్లిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిన సీబీఐ.. చంద్రబాబు డెరైక్షన్‌లో ముందుకెళ్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. అందుకే సీబీఐ పనితీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా.. చంద్రబాబు మాత్రం ఇప్పటి దాకా పల్లెత్తు మాట అనటంలేదన్నారు.
సీబీఐని విమర్శిస్తే తన అధికార దుర్వినియోగంపై దర్యాప్తు జరుపుతారేమోనని బాబు భయపడుతున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. సోమయాజులు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బాబు ఆదేశాలతో నడుస్తోన్న సీబీఐ ఒక్కొక్క కోర్టులో ఒక్కో విధంగా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో వివిధ అంశాలపై పలు చార్జిషీట్లు వేసినా.. అంతిమంగా అన్నింటికీ కలిపి తుది చార్జిషీట్ వేస్తామని సీబీఐ చెప్తోంది. అయితే అనుబంధ చార్జిషీట్లపై విచారణ జరపాలని కోరటం చాలా విచిత్రంగా ఉంది. ఇది కచ్చితంగా ప్రజలను తప్పుదోవ పట్టించటమే. తుది చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత వాదనలు ప్రారంభించవచ్చుకదా?’’ అని ఆయన ప్రశ్నించారు.
బాబు ఆరోపణల్లోనే స్పష్టత లేదు...
జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు చేస్తున్న కుట్రలను తన అనుకూల మీడియాతో గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారని సోమయాజులు విమర్శించారు. ‘‘జగన్‌పై మొదట లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేశారు. కానీ చంద్రబాబు డెరైక్షన్‌లోని సీబీఐ వేస్తున్న అన్ని చార్జిషీట్లను కలిపినా రూ. వెయ్యి కోట్లు లావాదేవీలు మాత్రమే జరిగాయని పేర్కొంది.
అదికూడా కేసు 70 శాతం దర్యాప్తు పూర్తయ్యిందని కోర్టుకు నివేదించింది. తాజాగా గవర్నర్‌ను కలిసిన సందర్భంగా బాబు మాట్లాడుతూ రూ. 43 వేల కోట్లు అంటున్నారు. అంటే రూ. 57 వేల కోట్లు ఎక్కడ పోయాయి. ఆయన చెప్పేదాంట్లోనే స్పష్టత లేకుండా ప్రజ లను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని వివరించారు. ఎమ్మార్ విషయంలోనూ రూ.10 వేల కోట్లు దుర్వినియోగం జరిగిం దంటూ బాబు అనుకూల మీడియా దుష్ర్పచారం చేస్తే.. సీబీఐ దర్యాప్తులో మాత్రం ప్రభుత్వానికి రూ. 43 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆరోపించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
రూల్స్ ప్రకారమే జీవోలిచ్చామని కన్నా చెప్పారు కదా..
చంద్రబాబు ఏం చెప్తే కాంగ్రెస్ అధిష్టానం తు.చ. తప్పకుండా పాటిస్తుందని.. ఆయన ఈ మధ్య ఢిల్లీ పర్యటన ముగించుకొని గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో.. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ భయంతోనే మాట్లాడారని సోమయాజులు వ్యాఖ్యానించారు. ‘‘బిజినెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ జీవోలు విడుదలయ్యాయని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కన్నా.. తాజాగా జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఇలా విభిన్నంగా ప్రవర్తిస్తూ ప్రజలు, సుప్రీంకోర్టులో ఎవర్ని మోసం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తే ఆయనకు వంద ఏళ్లు జైలు శిక్ష వేసినా తక్కువే అవుతుందని సోమయాజులు మండిపడ్డారు. ‘‘అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నా హజారే తమ్మునిగా తనను తాను భావిస్తున్న బాబు.. తనపై ఉన్న ఆరోపణల మీద విచారణ జరిపించుకునే ధైర్యం ఉందా?’’ అని సవాల్ విసిరారు. టీడీపీ విచిత్రమైన ధోరణి అవలంబిస్తోందన్నారు. ప్రభుత్వ తప్పిదాలను, వైఫల్యాలను వైఎస్‌కు లేదా జగన్‌కు ఆపాదించి నిందించటం ఆనవాయితీగా చేసుకుందని ధ్వజమెత్తారు. పాలకుల చేతకానితనం కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తితే దాన్నికూడా వైఎస్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ వల్లే అని చెప్పటం సిగ్గుచేటనన్నారు. బయ్యారం గనులను ప్రభుత్వం విశాఖ స్టీల్‌కు అప్పగిస్తే దానికి షర్మిల సమాధానం చెప్పాలని టీడీపీ నేత ఎర్రబెల్లి వ్యాఖ్యానించటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
వైఎస్ తొలి సంతకానికి తొమ్మిదేళ్లు
దివంగత సీఎం రాజశేఖరరెడ్డి సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట ఇదే రోజు (మే 14)న ప్రమాణ స్వీకారం చేసి సువర్ణపాలనకు శ్రీకారం చుట్టారని సోమయాజులు తెలిపారు. అంతకుముందు చంద్రబాబు తొమ్మిదేళ్ల ప్రజావ్యతిరేక దుష్టపాలనకు చరమగీతం పలికి రైతు, పేదప్రజల సంక్షేమానికి వైఎస్ నాంది పలికారన్నారు. సరిగ్గా ఇదే రోజున రైతుల ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేయటంతో పాటు 2001-04 మధ్య కాలం నాటి రూ. 1,400 కోట్ల విద్యుత్ బకాయిలు కూడా రద్దు చేశారని చెప్పారు. వైఎస్ ఐదేళ్ల పరిపాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 తదితర ఎన్నో సంక్షేమాలను విజయవంతంగా కొనసాగించారన్నారు.

0 comments:
Post a Comment