- 20న ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించనున్న పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ
కాగజ్‌నగర్, న్యూస్‌లైన్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించనుంది. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈనెల 20న ప్రాజెక్టు నిర్మాణ స్థలమైన ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిని సందర్శించనున్నారు. 2008 డిసెంబరు 16న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆయన మరణానంతరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవటం, బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించక పోవటంపై దృష్టి సారించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండుతో ఉద్యమం చేపట్టనుంది.
ఇందులో భాగంగానే ఈనెల 20న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్‌కు చేరుకొని నేరుగా కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి వెళ్లి ప్రాజెక్టు శిలాఫలకానికి క్షీరాభిషేకం చేసి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం విజయమ్మ కాగజ్‌నగర్‌కు చేరుకొని ఎస్పీఎం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభలోనే సిర్పూరు మాజీ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప వైఎస్సార్ సీపీలో చేరనున్నారని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఇంద్రకరణ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు జనక్‌ప్రసాద్ తెలిపారు.
0 comments:
Post a Comment