Tuesday, 7 May 2013

శైలజానాథ్ అవినీతి మంత్రి : గోనె ప్రకాష్ రావు


హైదరాబాద్ : ప్రాధమిక విద్యా శిక్షణ కళాశాలలకు అనుమతులు మంజూరు చేసేందుకు మంత్రి శైలజానాథ్ భారీ ముడుపులు పుచ్చుకున్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. జనవరి 25 నాటికే పూర్తి కావాల్సిన ప్రక్రియను స్వలాభాల కోసం కొనసాగించారన్నారు. 300 కళాశాలలకు ఒక్కొక్కదానికీ విడివిడిగా అనుమతులు మంజూరు చేస్తూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. 

ఒక్కో కళాశాల నుంచి 7 లక్షల రూపాయల వరకు సొమ్మును దండుకున్నారని గోనె మంగళవారమిక్కడ విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలోనూ ముక్కుపిండి మరీ వసూలు చేశారన్నారు. మంత్రి శైలజా నాథ్ కు సిఎం కిరణ్ మద్దతు తెలుపుతున్నారన్నారు. 

అదే విధంగా హైదరాబాద్ లో అక్రమాలకు పాల్పడుతున్న పేకాట క్లబ్బులకు కూడా ముఖ్యమంత్రి అండ ఉందని గోనె ఆరోపించారు. పేకాట క్లబ్ లకు అనుమతి ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని, ఎమ్మెల్సీలు ప్రేమ్ సాగర్, రంగారెడ్డిల లాబీల వల్లే పేకాట క్లబ్ లకు అనుమతి ఇచ్చారని ఆయన అన్నారు.

0 comments:

Post a Comment