వరంగల్ జిల్లా కు చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు కొండా మురళీ, కొండా సురేఖ దంపతులు తమ పార్టీలోనే కొనసాగుతారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెబుతున్నారు. పార్టీలో అంతర్గత కలహాల వల్ల పెద్దగా నష్టం ఉండదని ఆయన అన్నారు. అన్ని పార్టీలలో చిన్న, చిన్న గొడవలు ఉంటాయని ఆయన అన్నారు. కొండా సురేఖ దంపతులు తమతోనే ఉంటారన్న ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ నేతలు ఈ మాట చెప్పడమే కాని, మాజీ మంత్రి కొండా సురేఖకాని, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ కాని దీనిపై ఎందుకు స్పందించడం లేదో కరుణాకరరెడ్డి చెబితే బాగుంటుంది. లేదా కొండా దంపతులు నేరుగా తమ అభిప్రాయాలను చెబితే తప్ప ఈ వివాదం సమసిపోదు.
0 comments:
Post a Comment