Tuesday, 7 May 2013

కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ లోకి వెళతారా?

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను వీడతారా? ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లవచ్చా?దీనిపై మీడియాలో ప్రత్యేకించి జగన్ వ్యతిరేక మీడియాలో కధనాలు వస్తున్నాయి. దాడి వీరభద్రరావను పార్టీలో చేర్చుకున్న అంశంలో అదికారికంగా తాను జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కొణతాల ప్రకటించినప్పట్టికీ, ఆయన అసంతృప్తిలో రగులుతున్నారని , కాంగ్రెస్ లోకి వెళ్లే యోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి గంటా శ్రీనివాసరావులు కూడా కొణతాలను ఆయా సందర్భాలలో కలిసినప్పుడు ఈ ప్రస్తావన చేశారని కూడా కదనాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ లోకి వెళ్లే దైర్యం కొణతాల చేస్తారా అన్న చర్చ కూడా ఉంది.అలాగే వరంగల్ జిల్లా కు చెందిన నేతలు కొండా మురళీ దంపతులను కూడా కాంగ్రెస్ లోకి ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ రెండు నిజంగానే జరిగితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఎదురు దెబ్బే అవుతుంది.

0 comments:

Post a Comment