Tuesday, 7 May 2013

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం


బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. క్షణమొక యుగంగా గడుపుతున్న కన్నడ రాజకీయ నేతలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 

మధ్యాహ్నం 12 గంటలకు ప్రాథమిక ఫలితాలు తెలిసి, ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గానూ, 223 స్థానాలకు గత ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి మృతి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ దాదాపు కాంగ్రెస్‌దే కర్ణాటక పీఠం చెప్పడంతో ఇప్పటికే ఆ పార్టీ నేతలు సీఎం పదవి కోసం జోరుగా పైరవీలు మొదలు పెట్టారు. మొత్తానికి కాసేపట్లో ఉత్కంఠ వీడి పీఠం ఎవరిదో తేలనుంది.

0 comments:

Post a Comment