వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి , పాదయాత్రికురాలు షర్మిల ఒక సాంకేతిక అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఓ వ్యక్తిని దోషీ అని చెప్పకుండా జైల్లో ఎలా పెడతారని, జగన్ నిర్దోషి అని తేలితే జైలు జీవితాన్ని వెనక్కి ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు.కాంగ్రెస్-టిడిపి కలిసి జగనన్నను జైలుపాలు చేశారని, సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్ పై కుట్రలు పన్నుతున్నారని, కుంటిసాకులతో జగనన్నను జైల్లో పెట్టారని షర్మిల ఆరోపించారు. ఛార్జీషీట్‌లో పేర్లున్న మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయలేదని...ఎంపీగా వున్న జగన్ ను ఎలా అరెస్ట్ చేశారని షర్మిల ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ సంస్థలు కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నాయని షర్మిల విమర్శించారు.షర్మిల లేవనెత్తిన ప్రశ్నలలో కొంత అర్దం ఉందని చెప్పాలి.బెయిల్ ఇచ్చే కారణమే బహుశా అది అయి ఉంటుంది.కోర్టులలో శిక్ష పడితే అది వేరే విషయం.అలాకాకుండా విచారణ పేరుతో నెలల తరబడి జైలులో ఉంచడం అంత పద్దతిగా కనిపించదు. సుప్రింకోర్టు సైతం విమర్శలకు అతీతంగా తీర్పులు ఇవ్వకపోతే దేశంలో న్యాయవ్యవస్థ పై ప్రజలలో సందేహాలు వచ్చే ప్రమాదం ఉంది.
0 comments:
Post a Comment