Sunday, 12 May 2013

ఆ మంత్రుల్ని తక్షణమే తొలగించాలి: బీజేపీ

హైదరాబాద్: కేంద్రమంత్రులు బన్సల్, అశ్వనీకుమార్‌లను తొలగించినట్టే.. సుప్రీంకోర్టు నుంచి నోటీసులందుకున్న రాష్ట్ర మంత్రులందరితోనూ రాజీనామా చేయించాలని బీజేపీ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. మంత్రులపై సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసినా, కోర్టులు అనుమానాలు వ్యక్తంచేసినా ఇంకా వారిని మంత్రివర్గంలో కొనసాగించడం ఏ నైతిక ప్రమాణాలకు నిదర్శనమో చెప్పాలని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు కాంగ్రెస్‌ను నిలదీశారు. 

0 comments:

Post a Comment