ప్రజల విశ్వసనీయత కోల్పోయిన నాయకుడు చంద్రబాబు అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరిన టిడిపి మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ వదిలినవారిని విమర్శించడం మాని, బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. అవినీతి ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు. విచారణ గడువు పొడిగించాలని న్యాయవాది అశోక్‌భాను చెప్పడం సీబీఐ ఆంతర్యమా? సోనియా ఆంతర్యమా అని ఆయన ప్రశ్నించారు. జైలులో ఉన్నా జనం గుండెల్లో వైఎస్ జగన్ ఉన్నారని ఆయన అన్నారు. కేంద్రంలో మంత్రులను తొలగించిన కాంగ్రెస్ రాష్ట్ర మంత్రులను తొలగించకపోవడంలో ఆంతర్యం రహస్యాలు బయటపడతారనా అని ఉమ్మారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో టిడిపి నేతలు చేరడం, వారితోనే చంద్రబాబు పై విమర్శలు చేయించడం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే ఉందని భావించాలి.
0 comments:
Post a Comment