బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడి శ్రీకంఠీరవ స్టేడియంలో గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు.
సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూర్, తదితర ప్రాంతాల నుంచి 50 వేల మంది హాజరవుతారని అంచనా. కార్యక్రమంలో సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణం చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య సారథ్యంలో కాంగ్రెస్.. బీజేపీపై విజయం సాధించడం, ఆయన కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికవడం తెలిసిందే. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆరేళ్ల కిందట జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చే రారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. రాష్ట్రానికి 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య వచ్చే వారంలో కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
0 comments:
Post a Comment