వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో లేరని జనం గుండెల్లో ఉన్నారని టీడీపీ మాజీ నేత, ప్రస్తుత వైఎస్ఆర్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.
ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులను తొలగించిన కాంగ్రెస్ అధిష్టానం.. రాష్ట్రంలో ఆరోపణలున్న మంత్రులను ఎందుకు తొలగించలేదని నిలదీశారు. మంత్రులు రహస్యాలను బయటపెడతారనే భయం ప్రభుత్వానికి పట్టుకుందని, అందువల్లే వారిని తొలగించడం లేదన్నారు.
రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వసనీయత కోల్పోయిన నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క చంద్రబాబేనని విమర్శించారు. పార్టీ వదిలినవారిని విమర్శించడం మాని.. బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉమ్మారెడ్డి హితవు పలికారు.
0 comments:
Post a Comment