Sunday, 12 May 2013

వై.ఎస్ జగన్ పార్టీకి కొత్త ఊపిరి ఇచ్చేది వీరే!

కాంగ్రెస్ నేతలు ఒక్కోసారి ఒక్కో వ్యాఖ్య చేస్తుంటారు.దానితో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అదినేతకు వాదనకు మంచి పాయింటు దొరుకుతుంటుంది.అసలే జగన్ పై రాజకీయ కేసు పెట్టారని విమర్శలు వస్తుంటే, గత ఉప ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి అజాద్ వాటిని నిజం చేస్తున్నట్లుగా జగన్ కాంగ్రెస్ లో ఉండి ఉంటే కేంద్ర మంత్రి అయి ఉండేవారని అన్నారు. ఈ మధ్య మరో మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ జగన్ కాంగ్రెస్ లో కలిసేవరకు బెయిల్ రాదని వ్యాఖ్యానించారు. తాజాగా మరో సీనియర్ నేత , ఆర్టీసి ఛైర్మన్ ఎమ్.సత్యనారాయణరావు జగన్ కొత్త పార్టీ పెట్టకుండా ఉండి ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కావని వ్యాఖ్యనించారు.ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగి ఉంటే ఈ సమస్యలే ఉండేవి కావని, ఇన్ని కష్టాలు పడేవారు కారని వ్యాఖ్యానించారు. ఈ రకంగా జగన్ పై కాంగ్రెస్ కక్ష పూని కేసు పెట్టించిందని,నిర్బందించిందని , బెయిల్ రాకుండా చేస్తున్నదని వీరే చెబుతున్నట్లుగా ఉంది. అదే జగన్ పార్టీకి ఎప్పటికప్పుడు కొత్త ఊపిరి ఇస్తోందనుకోవచ్చు.

0 comments:

Post a Comment