హైదరాబాద్: కేసీఆర్, హరీష్‌రావుపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేసినట్టు టీఆర్ఎస్ నుంచి బహిష్కృతుడయిన రఘునందన్ రావు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించానని చెప్పారు. టీఆర్ఎస్ కు సంబంధించిన అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. న్యాయనిపుణులపై చర్చించిన తర్వాత తిరిగి పిలుస్తామన్నారని అన్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రఘునందన్ రావుపై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ రఘునందనరావు రెండు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డిని కలిశారు. తమకు భద్రత కల్పించాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
0 comments:
Post a Comment