Tuesday, 21 May 2013

రఘునందన్ సీఎం తొత్తు : టీఆర్‌ఎస్

హైదరాబాద్: రఘునందన్‌రావు సీఎం కిరణ్ తొత్తుగా మారారని టీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ సహా ఇతర నేతలపై ఆయన చేసిన విమర్శల్లో ఒక్కదానికి కూడా ఆధారాలు చూపలేకపోయారని అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా గెలిచిన వెంటనే తనకు గన్‌మెన్లను కేటాయించాలని స్వామిగౌడ్ ప్రభుత్వాన్ని కోరితే ఇంతవరకు స్పందనలేదని.. కానీ, కోరిన రెండు గంటల్లోనే రఘునందన్‌కు డీజీపీ గన్‌మెన్‌ను కేటాయించారని తెలిపారు. కిరణ్ కనుసన్నలలోనే ఆయన పనిచేస్తున్నారనడానికి ఇది నిదర్శనం కాదా అని శ్రవణ్ ప్రశ్నించారు. 

0 comments:

Post a Comment