కరీంనగర్ ఎమ్.పి పొన్నం ప్రబాకర్ తాను కాంగ్రెస్ లోనే ఉండి తెలంగాణ కోసం పోరాడుతానని ప్రకటించారు.ఇప్పటికీ
కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుదన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.హై కమాండ్ మాట నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.లేకుంటే కాంగ్రెస్ కు తెలంగాణలో తీవ్ర నష్టం వస్తుందని ఆయన హెచ్చరించారు.
ముగ్గురు ఎంపీలు ఇదే అంశంపై అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించారని, అధిష్టానం సానుకూలంగా స్పందిస్తే వారు పార్టీలోనే కొనసాగుతారేమోనని పొన్నం అభిప్రాయపడ్డారు. తాను పార్టీలో ఉండే తెలంగాణ కోసం పోరాడతానని పొన్నం తెలిపారు.
0 comments:
Post a Comment