కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు హవా కొనసాగుతోందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉప నేత శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష నేత చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా రాష్ట్రప్రభుత్వం వెనుకాడటం లేదని ఆమె అన్నారు.చంద్రబాబు ఏం చెబితే కాంగ్రెస్ పార్టీ అదే పాటిస్తుందని ఆరోపించారు.చంద్రబాబు డిమాండుకు తలొగ్గే ఇద్దరు మంత్రులను కాంగ్రెస్ బలిపశువులను చేసిందని ఆమె ఆరోపించారు.ఇప్పుడు ముఖ్యమంత్రిని చంద్రబాబు మార్చాలంటే మార్చేస్తుందని కూడా ఆమె అన్నారు.ధర్మాన ప్రసాదరావు, సబితల రాజీనామాలపై కాంగ్రెస్ ఇంత హడావుడి నిర్ణయం వెనుక మతలబు ఏమిటని ఆమె ప్రశ్నించారు.
0 comments:
Post a Comment