తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండైన రఘునందనరావు చెప్పినట్లుగానే చేశారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమ వసూళ్లపై చర్య తీసుకోవాలని కోరుతూ రఘునందనరావు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా కేసీఆర్, హరీష్‌రావులపై సీఆయన తన ఫిర్యాదును ఇచ్చారు. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించానని ఆయన తెలిపారు. న్యాయనిపుణులపై చర్చించిన తర్వాత తిరిగి పిలుస్తామన్నారని అన్నారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ రఘునందనరావు రెండు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేయగా, ఇప్పుడు కెసిఆర్, హరీష్ లపై ఫిర్యాదు సిబిఐకి ఫిర్యాదు చేయడం విశేషం.అయితే ఈ ఫిర్యాదును నేరుగా సిబిఐ చేపట్టే అవకాశం ఉందా అన్నది చర్చనీయాంశం. న్యాయవాది అయిన రఘునందనరావు ఏ చట్టం ప్రకారం ఈ ఫిర్యాదు చేశారో తెలియవలసి ఉంది. సిబిఐ ఈ కేసును స్వీకరిస్తుందా?
0 comments:
Post a Comment