కాంగ్రెస్-టీడీపీ ఎన్ని కుమ్మక్కు కుట్రలకు దిగినా, జన నేతను ప్రజలకు దూరం చేయాలన్న వాటి లక్ష్యం మాత్రం అస్సలు నెరవేరలేదు. సరికదా, ఈ నిస్సిగ్గు ప్రయత్నాల ద్వారా రెండు పార్టీలూ విశ్వసనీయతను, జనాదరణను నానాటికీ కోల్పోతూ అధఃపాతాళానికి దిగజారుతుంటే... తిరుగులేని జనాదరణతో నాయకునిగా జగన్ అంతకంతకూ ఎదుగుతున్నారు. తాము వైఎస్ తనయుని వెన్నంటే ఉన్నామని ప్రతి ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా తీర్పు చెబుతూనే వస్తున్నారు. కనీసం జేబు వ్యవస్థల సాయంతో జగన్‌ను ప్రజలకు తాత్కాలికంగా దూరం చేయగలిగామన్న ఆనందం కూడా టీడీపీ, కాంగ్రెస్‌లకు మిగల్లేదు.
ఆయన తరఫున ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, ఇంకోవైపు సోదరి షర్మిల ప్రజల పక్షాన వారి ప్రతి సమస్యపైనా పోరాటం చేస్తూనే ఉన్నారు. నిరసనలు, దీక్షలతో పాలకులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ, ప్రజా సమస్యల పట్ల వారి నిర్లక్ష్యాన్ని ఎండగడుతూనే ఉన్నారు. విజయమ్మ దీక్షలకు, షర్మిల చేపట్టిన చరిత్రాత్మక ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్న జనం.. వారి ప్రతి అడుగులోనూ జగన్‌ను చూసుకుంటున్నారు. తమ నేత తిరిగి తమ మధ్యకు వచ్చే సుదినం కోసం ఎదురు చూస్తున్నారు.
అధికార-ప్రధాన ప్రతిపక్షాలు ఒక్కటై... జేబు వ్యవస్థల సాయంతో జన నేత, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలకు దూరంగా ఉంచి ఏడాది కావస్తోంది. దీని పూర్వాపరాలపై ప్రత్యేక కార్యక్రమం ‘చేతిలో సైకిల్’ బుధవారం రాత్రి 8.20కి సాక్షి టీవీలో..
0 comments:
Post a Comment