హైదరాబాద్: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోసం ఏం చేయడానికైనా రాష్ట్రప్రభుత్వం వెనుకాడటం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు ఏం చెబితే కాంగ్రెస్ పార్టీ అదే పాటిస్తుందని ఆరోపించారు.
ముఖ్యమంత్రిని చంద్రబాబు మార్చాలంటే.. మార్చే స్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డిమాండ్‌కు తలొగ్గి ఇద్దరు మంత్రులను బలిపశువులను చేశారని అన్నారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై ఇంత హడావుడిగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏమొచ్చిందని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు.
0 comments:
Post a Comment